
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో (Revenue Department) కొత్తగా ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుద్యోగులకు తీపి కబురు
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ.. త్వరత్వరగా పరీక్షలు నిర్వహిస్తూ.. అంతే వేగంగా ఫలితాలు వెల్లడిస్తోంది. నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్-1,2,3 పరీక్షలు నిర్వహించి ఫలితాలు (Group 1 Results) వెల్లడించిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో వీటి నియామక ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో 10వేలకు పైగా ఉద్యోగాలు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.