VD12 అప్డేట్.. విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. లైగర్, ఖుషి ఫలితాలతో నిరాశ పరిచిన విజయ్ తన నెక్స్ట్ మూవీని మాత్రం పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడం ఖాయమంటూ వచ్చేస్తున్నాడు. VD12 వర్కింగ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.

రౌడీ కోసం టైగర్

ఫిబ్రవరి 12వ తేదీన VD12 టైటిల్ టీజర్ (VD12 Teaser) రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. తాజాగా విజయ్, ఎన్టీఆర్ (NTR) ఒకచోట కలిసిన ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. టైగర్ తో రౌడీ అనే క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే VD12 సినిమా కోసం తారక్ తన గాత్రం అందించనున్నాడట. ఈ టీజర్ లో ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో విజయ్ పాత్రను పరిచయం చేయనున్నాడట.

హిందీలో రణ్ బీర్.. తమిళ్ లో సూర్య

మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్‌కు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), తమిళ వెర్షన్‌కు సూర్య (Suriya) వాయిస్ ఓవర్ ఇచ్చారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తుండగా రుక్మిణి వసంత్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *