NTR క్రేజీ లైనప్.. జైలర్ దర్శకుడితో సినిమా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) చేతిలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు దేవర పార్ట్-2 (Devara Part-2) ఉన్నాయి. అంతే కాకుండా వార్-2 సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ (Dragon), కొరటాల శివతో దేవర పార్ట్-2 చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉండగానే మరో సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తమిళ సినిమా ఇండస్ట్రీలో డాక్టర్, జైలర్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడితో ఎన్టీఆర్ ఓ ప్రాజెక్టు చేయనున్నట్లు తెలిసింది.

తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌ కుమార్ (Nelson Dilipkumar) తారక్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. మాస్, యాక్షన్, కామెడీ జానర్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊరమాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు ‘రాక్ (ROCK)’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తారక్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ రానుందట.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ (Prashant Neel) సినిమా తర్వాత ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగవంశీ నెల్సన్ తో ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారట. 2026లో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. నెల్సన్ మాస్ టేకింగ్‌.. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిస్తే ఈ సినిమా పక్కా కమర్షియల్ హిట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *