పవన్‌ కళ్యాణ్‌ గురువు షిహాన్‌ హుసైని కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువు షిహాన్‌ హుసైని (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. హుసైని (Shihan Hussaini) మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గురువుగా షిహాన్

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)కు హుసైని.. మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇక షిహాన్‌ హుసైని సినిమాల సంగతికి వస్తే.. 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్‌’ సినిమా ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్‌ హీరోగా నటించిన ‘బద్రి (Badri Movie)’ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక షిహాన్.. ఆర్చరీలోనూ ట్రైనింగ్ ఇచ్చే వారు. ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారు చేశారు షిహాన్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *