”కన్నప్ప’ను ట్రోల్ చేస్తే.. శివుడి చేతిలో మీరు ఫినిష్‌’

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప (Kannappa)’. మంచు మోహన్ బాబు నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే మంచు విష్ణు సింగిల్ హ్యాండెడ్ గా ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు. తాజాగా ‘బుక్‌ మై షో’ ఆధ్వర్వంలో జరిగిన రెడ్‌ లారీ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప నటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ నటులు తమదైన శైలిలో సమాధానమిస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంచు విష్ణు అన్నారు.

కావాలని కాంట్రవర్సీ చేయాలనుకుంటే

సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఓ వ్యాఖ్యం కట్ చేసి వైరల్ చేసి కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది నేను పట్టించుకోను. కానీ ప్రజలు చాలా స్మార్ట్. వ్యూస్ కోసం కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకున్నా.. జనాలు పూర్తి వీడియో చూసిన తర్వాతే నిజానిజాలు తెలుసుకుంటున్నారు. తీరా అసలు మ్యాటర్ తెలిశాక న్యూసెన్స్ అనుకుంటున్నారు.’ అని మంచు విష్ణు తెలిపారు.

శివాగ్రహానికి గురవుతారు

ఇక ఇదే వేదికపై ఉన్న నటుడు రఘుబాబు (Raghu Babu) ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మైక్‌ అందుకుని, ట్రోల్స్‌పై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్స్‌ చేస్తే, శివుడి ఆగ్రహానికి, శాపానికీ గురవుతారంటూ రఘుబాబు సంచలన కామెంట్స్ చేశారు. గుర్తుపెట్టుకోండి. 100 శాతం కచ్చితంగా చెబుతున్నాను.. ట్రోల్‌ చేస్తే ఇక ఫినిష్‌ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.

మంచు వారసుల ఎంట్రీ

ఇక ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన కీలక నటులు నటిస్తున్నారు. ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం టాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంచు విష్ణు తనయలు అరియానా, వివియానా, తనయుడు అవ్రామ్ భార్గవ్ ఈ మూవీతో ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమాకు ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ ముకేశ్‌ కుమార్‌ సింగ్‌  దర్శకత్వం వహించారు.

Related Posts

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Kubera: కుబేరలోని పిప్పీ పిప్పీ డమ్ డమ్ డమ్’ ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్..

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్​ టాక్​ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. తాజాగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *