NTR WAR 2: ఆర్మీ ఆఫీసర్‌గా తారక్?.. వార్‌2లో లుక్స్ వైరల్

Mana Enadu: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘వార్ 2(WAR-2)’. ఈ సినిమాతో యంగ్‌టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు . స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ(Ayaan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్(Yash Raj Spy Universe) లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటూ తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

 గూస్‌బంప్స్ పక్కా..

తాజాగా ఈ మూవీ షూట్‌లో NTR జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఓ ఫైట్ సీన్‌(Fight scene)లో హృతిక్, తారక్‌ కల్సి పాల్గొన్న ఫొటో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌ అవుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ ముంబైలో జరుగుతోంది. సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోలు లీక్(NTR photos leaked) అయ్యాయి. అందులో ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరిపోయింది. ఫొటోలో తారక్ ఆర్మీ షర్ట్ ధరించి ఉండడంతో సినిమాలో ఆయనది ఆర్మీ ఆఫీసర్(Army officer) రోల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో NTR, హృతిక్ మధ్య జరిగే ఫైట్‌తో ఛేజింగ్ సీన్ గూస్ బంప్స్‌ తెప్పించడం పక్కా అని బీటౌన్ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) కూడా కనిపించనుంది.

https://twitter.com/hr_SATYA_/status/1849733004559528012

 దుమ్మురేపుతోన్న ‘దేవర’

కాగా ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘దేవర(Devara)’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు నెలరోజులు అవుతున్నా.. ఎక్కడ చూసిన దేవర గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్(Janhvi Kapoor) తారక్‌కు జోడీ కనిపించగా.. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) విలన్ రోల్‌లో ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమా నవంబర్ 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Share post:

లేటెస్ట్