బాస్​ను కలిసిన కింగ్.. ANR అవార్డుల వేడుకకు చిరంజీవికి ఆహ్వానం

Mana Enadu : టాలీవుడ్ అగ్రనటులు ఒక వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే పండగ. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, నటసామ్రాట్ అక్కినేని నాగార్జున ఒకే వేదిక పంచుకుంటే ఇక సందడి అంతా ఇంతా కాదు. త్వరలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక చోటుకు రానున్నారు. ఏఎన్నార్ అవార్డుల(ANR Awards 2024) కార్యక్రమం దీనికి వేదిక కానుంది. ఈ క్రమంలోనే చిరంజీవిని (Chiranjeevi) హీరో నాగార్జున కలిశారు.

త్వరలో జరగనున్న ఏఎన్నార్‌ అవార్డుల కార్యక్రమానికి చిరును నాగ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫొటోలను నాగార్జున తాజాగా తన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ‘ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్. నాన్న ఏఎన్నార్ శతజయంతి(ANNAR Centenary 2024) వేడుకలు ఘనంగా జరుపబోతున్నాం. ఈ వేడుకకు మెగాస్టార్లు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌ రానున్నారు. వారి రాకతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుంది. ఈ శతజయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం’ అని పోస్టు కింద అందమైన క్యాప్షన్ జత చేశారు.

2024కు గాను ఏయన్నార్‌ జాతీయ అవార్డు (ANR National Award)ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున (Nagarjuna) గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 28వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్​కు బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తుతం నాగార్జున షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్​లో చూడటం చాలా ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ హీరోల సినిమాల సంగతికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్​లో సూపర్ స్పీడ్​గా వెళ్తున్న చిరంజీవి డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర(Vishwambhara)’ లో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి హనుమాన్‌ భక్తుడిగా కనిపించనున్నారు. మరోవైపు నాగార్జున.. ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ‘కుబేర(Kubera)’లో నటిస్తున్నారు.

Share post:

లేటెస్ట్