ఆ లెటర్​లో ఏముంది.. ఉత్కంఠ రేపుతున్న ‘క’ ట్రైలర్

Mana Enadu : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram). ఆయన సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు భావిస్తారు. ఇక కిరణ్ అబ్బవరం నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ‘క(Ka Movie)’ త్వరలో రిలీజ్ కాబోతోంది. తన్వీ రామ్‌ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాను సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా తెరకెక్కించారు.

ఆద్యంతం ఆసక్తిగా క ట్రైలర్
దీపావళి(Diwali) కానుకగా అక్టోబర్‌ 31న విడుదల కాబోతున్న ‘క’ సినిమా ట్రైలర్​ను ఇవాళ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఉత్కంఠకు గురి చేసే సీన్లతో ట్రైలర్ అదిరిపోయింది. ఈ వీడియోలో కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్​లో డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఆ లెటర్​లో ఏముంది?
యాక్షన్ సీక్వెన్స్​తో మొదలైన ట్రైలర్(Ka Trailer)​లో అభినయ వాసుదేవ్ అనే పోస్టుమ్యాన్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు. మధ్యాహ్నమే చీకటి పడే ఆ ఊరు చాలా ప్రత్యకమైందని ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది. అక్కడ సత్యభామ అనే అందమైన భామతో ప్రేమలో పడిన అభినయ వాసుదేవ్ లైఫ్​ను 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ.. ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌‌ను బెదిరించడం ట్రైలర్​లో చూడొచ్చు. ఇంతకీ ఆ లెటర్​లో ఏముంది? వాసుదేవ్​ను అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతోందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Share post:

లేటెస్ట్