Mana Enadu : టాలీవుడ్ నటి, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అందరికీ సుపరిచతమే. తాజాగా ఈ భామ ‘పొట్టేల్’ (Pottel) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ ది ప్రెస్‌లో ఓ లేడీ జర్నలిస్టు అనన్యను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగింది. దీనికి అనన్య కూడా దీటుగా బదులిచ్చింది. అయితే ఓ మహిళా జర్నలిస్టు ఇలాంటి ప్రశ్నలడగడం తనను ఇంకా ఎక్కువ బాధపెట్టిందని అనన్య(Ananya Nagalla) వాపోయింది.
ఇంతకీ ఆ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలేంటంటే?
“తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే కమింట్మెంట్(Casting Couch) అడుగుతారని భయపడతారని అందుకే ఎక్కువ తెలుగు హీరోయిన్లు లేరని టాక్. మీకు అలాంటి అనుభవం ఎదురైందా? మీరు చేసుకునే అగ్రిమెంట్లలో కూడా కమిట్మెంట్ గురించి ఉంటుందట కదా? కమిట్మెంట్ను బట్టి పారితోషికం ఉంటుందని టాక్ నిజమేనా?” అంటూ ఇలా నటి అనన్యను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగింది సదరు మహిళా జర్నలిస్టు. అయితే దీనికి అనన్య కూడా దీటుగానే బదులిచ్చింది. మీకు ఇలాంటివి ఎవరు చెప్పారో గానీ.. నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు. మీరు చెబుతున్నట్టుగా జరగడం అయితే నేను తెలుగు ఇండస్ట్రీలో చూడలేదు. అంటూ గట్టిగా బదులిచ్చింది.
జర్నలిస్టు సంఘానికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ
అయితే ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) తీవ్రంగా స్పందించింది. అనన్యను క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలడిగిన మహిళా జర్నలిస్టు వ్యవహారంపై జర్నలిస్టు సంఘాని(Journalist Association)కి లేఖ రాసింది. ఆ లేడీ జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్ చేసింది. ఆమె క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన విషయాలు ఎలా మాట్లాడగలిగారని, వాటికి సంబంధించిన ఆధారాలు ఛాంబర్‌కు సమర్పిస్తే రహస్యంగా ఉంచి విచారణ జరుపుతామని పేర్కొంది. ఆధారాలు లేకపోతే మాత్రం నిరాధార ఆరోపణలు చేసిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఛాంబర్‌పై నెటిజన్లు ఫైర్
అయితే ఫిలిం ఛాంబర్ తీరుపై ఇప్పుడు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో లేడీ జర్నలిస్టు కాబట్టి చర్యలకు ఉపక్రమించారని, గతంలో ఇలాంటి ప్రశ్నలు పురుష జర్నలిస్టులు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయని, అప్పుడు ఎందుకు ఫిలిం ఛాంబర్ ముందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మహిళ కాబట్టి ఆ జర్నలిస్టుపై వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు.
అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు
నిజంగా ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే.. ఇంతకుముందు జర్నలిస్టులు ఇలాంటి ప్రశ్నలు అడిగి నటీమణులను ఇబ్బంది పెట్టినప్పుడే ఈ చర్యలు తీసుకోవాల్సిందని సోషల్ మీడియా వేదికగా ఛాంబర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్(Sri Reddy Casting Couch Issue) గురించి మాట్లాడుతూ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేసినప్పుడు ఛాంబర్ ఎక్కడికి వెళ్లిందని నెట్టింట నిలదీస్తున్నారు. పూనమ్ కౌర్ కూడా బడా హీరోలు, దర్శకుల పైన బహిరంగంగా ఆరోపణలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నెటిజన్లు ఫిలిం ఛాంబర్‌ను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా రచ్చ అవుతోంది.