Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ‘పుష్ప-2’తో ప్రపంచ ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి(S/O Satyamurthy), అల వైకుంఠపురం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో మరో బ్లాక్ బస్టర్ తీసేందుకు రెడీ అవుతోంది. అయితే బన్నీ – త్రివిక్రమ్ సినిమాపై తాజాగా ఆ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆ జానర్‌లో బన్నీ సినిమా
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా స్క్రిప్ట్ పనులు చివరిదశలో ఉన్నాయని ఆయన నాగవంశీ(Producer Suryadevara Naga Vamsi) అప్డేట్ ఇచ్చారు. ‘పుష్ప 2(Pushpa 2)’ పూర్తయ్యాక ఈ సినిమా వివరాలు వెల్లడిస్తామని.. జనవరిలో స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసి సినిమాను ప్రకటిస్తామని తెలిపారు. ఇక మార్చి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమా జానర్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) కూడా టచ్ చేయని జానర్‌లో బన్నీ, త్రివిక్రమ్ చిత్రం ఉండబోతోందని సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశారు.
సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా
ఇక గతంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. అందుకే ఈ సూపర్ హిట్ కాంబోపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలున్నాయి. ‘పుష్ప 2’ పూర్తి కాగానే త్రివిక్రమ్ ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారు.