Mana Enadu: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). పార్ట్-1 కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్(Posters, teasers, songs)కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముందు DECEMBER 6న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాను ఒక్కరోజు ముందే అంటే DECEMBER 5నే తీసుకొస్తున్నామని వెల్లడించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మా ప్లాన్స్ మాకున్నాయ్: నిర్మాతలు
తాజాగా సినిమాకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి(Producers are Naveen Yerneni and Ravi Shankar Yalamanchili) సమాదానాలు ఇచ్చారు. ‘పుష్ప 2’ ను వీలైనన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. దానికి సంబంధించి మేము కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్.. ఇలా వీలైనన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్(International Languages)లో రిలీజ్ చేస్తాం. కాకపోతే ముందు పాన్ ఇండియా రిలీజ్ అయిన.. 2,3 నెలలకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.
బన్నీకి భారీ రెమ్యూనరేషన్
ఇదిలా ఉండగా పుష్ప-2కు అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్(Huge remuneration) తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.100 కోట్లు తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే మూడేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించడంతో రూ.200 కోట్లకుపైగా తీసుకుంటారని మరికొన్ని తెలిపాయి. లేదంటే సినిమా కలెక్షన్లలో 27శాతం ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. మరోవైపు ‘పుష్ప-2’కి కొనసాగింపుగా పార్ట్-3(Pushpa Part-3) ఉంటుందని నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. పార్ట్-2 ఎండింగ్‌లో కొనసాగింపునకు లీడ్ కూడా ఉంటుందని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.
Take my body at Sangam / Sarat Theater On Dec 5th Bro @alluarjun ❤️🥹🔥🔥💪💪#Pushpa2TheRule pic.twitter.com/TGCC3RG3Pt
— Sunny (@Ikunasanyasirao) October 24, 2024