Mana Enadu : నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది నటులు టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. నందమూరి తారకరామా రావు నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్(NTR), కల్యాణ్ రామ్.. ఇలా ఒక్కొక్కరిగా వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ గొప్ప పేరుతో పాటు ఫ్యాన్డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ(Balakrishna) వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.
మోక్షజ్ఞ(Mokshagna) తన తొలి సినిమాను హను-మాన్ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ(Prashant Varma)తో చేస్తున్నాడు. ఈ సినిమాను మోక్షజ్ఞ పుట్టిన రోజున అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ వర్మతో సినిమా అన్నప్పటి నుంచి ఈ మూవీ ఏ జానర్లో ఉంటుందో, స్టోరీ ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి మరో అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఇప్పుడు ఓ అప్డేట్ బాగా వైరల్ అవుతోంది.
మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ సినిమాను పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అయ్యారట. సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ 2వ తేదీన మూవీని లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 2వ తేదీన క్లాప్ కొట్టి రెగ్యులర్ షూటింగ్(Mokshagna Movie Shooting) షురూ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్గా పరిచయం కానుందని సమాచారం.
ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా రానా(Rana Daggubati) నటించనున్నట్లు సమాచారం. 2025 సెకండ్ హాఫ్‌లో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు వారసుడి తొలి సినిమాలో బాలయ్య బాబు కూడా చిన్న కేమియో రోల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.