Hollywood : ‘టార్జాన్’ హీరో రాన్ ఎలీ కన్నుమూత

Mana Enadu : ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్​ ‘టార్జాన్(Tarzan)’ గురించి తెలియని వారుండరు. 90లలో సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టున్న సిరీస్ ఇది. ఈ సిరీస్​లో రాన్ ఎలీ(Ron Ely) హీరోగా నటించారు. అయితే నేడు (అక్టోబర్ 24) రాన్ ఎలీ కన్నుమూసినట్లు తెలిసింది. టార్జాన్​లో తన పాత్రకు పేరు గాంచిన రాన్ ఎలీ 86 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె కిర్​స్టెన్​ ఎలీ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అయితే ఆయన ఎప్పుడు, ఎలా చనిపోయారనేది మాత్రం ఆమె చెప్పలేదు.

ఆయన ఓ గొప్ప వ్యక్తి

“ఈ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. నేను నా తండ్రిని కోల్పోయాను. ఆయన్ను అందరూ హీరో అంటుంటారు. నటుడిగా, రైటర్​గా, కోచ్‌గా, గురువుగా, ఫ్యామిలీ మ్యాన్​గా, నాయకుడిగా రాణించిన బహుముఖ వ్యక్తి నా తండ్రి. ఆయన ఎక్కడుంటే అక్కడ​ పాజిటివ్​ వైబ్స్​ను క్రియేట్ చేసేవారు.

ఆయన ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండేది. అలా ఇతరులను ప్రభావం చూపే వ్యక్తులను నేను ఎవరినీ చూడలేదు ఆయణ్ను తప్ప. మా నాన్నే నా ప్రపంచం. నా రోల్ మోడల్ కూడా ఆయనే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారు. ఓ బలమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన ఎంతో బలంగా, తెలివిగా, ఫన్నీగా, సెన్సిటివ్​గా ఉండేవారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు.” అని రాన్ ఎలీ కుమార్తె కిర్​స్టెన్ ఎలీ తన పోస్టులో రాసుకొచ్చారు.

ఆయన మరణం హాలీవుడ్​కు తీరని లోటు

మరోవైపు రాన్ ఎలీ మరణం గురించి తెలుసుకున్న పలువురు నటులు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన మరణం హాలీవుడ్(Hollywood) సినీ పరిశ్రమకు తీరని లోటు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

Tarzan Hero Ron Ely, Tarzan Hero Ron Ely died, Tarzan Hero Ron Ely death news, Hollywood Hero Ron Ely died, Hero Ron Ely latest news

Share post:

లేటెస్ట్