లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు.. ఆస్కార్‌ వేదికకు ముప్పు.. నామినేషన్లు వాయిదా

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ను కార్చిచ్చు (Los Angeles Wildfire) చుట్టుముట్టింది. ఇది అంతకంతకూ విస్తరిస్తూ పోతుండటంతో వేలాది సంపన్న భవనాలు కాలిబూడిదవుతున్నాయి. ఇక ఈ కార్చిచ్చు ప్రభావం తాజాగా ఆస్కార్‌ను తాకింది. కార్చిచ్చు నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్‌ నామినేషన్‌ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది.

ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ ఆలస్యం

జనవరి 8 నుంచి 14 వరకు అకాడమీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కార్చిచ్చు నేపథ్యంలో దీని ఓటింగ్‌ ఆలస్యం కావడంతో జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్‌ నామినేషన్లను జనవరి 19వ తేదీకి వాయిదా (Oscar nominations) వేశారు. 2025 మార్చి 2న ఆస్కార్‌ వేడుక జరగనుంది. 97వ అకాడమీ అవార్డ్స్‌లో మొత్తం 323 చలన చిత్రాల జాబితాలు ఇటీవల వెల్లడించగా..  207 చిత్రాలు ఉత్తమ చిత్రాల విభాగంలో పోటీ పడనున్నాయి. వీటిలో ఆరు ఇండియన్ సినిమాలున్నాయి. వీటిలో ఎన్ని నామినేషన్‌ దక్కించుకుంటాయనేది జనవరి 19న తేలనుంది.

హాలీవుడ్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు

హాలీవుడ్‌లో పుట్టిన కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్‌ హిల్స్‌ (Hollywood Hills)ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చాలా మంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు. మొత్తంగా 1100 నిర్మాణాలు దగ్ధమైనట్లు సమాచారం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.3 లక్షల మంది ఇళ్లు ఖాళీ చేయించారు. ఇప్పటివరకు మొత్తం ఆరుచోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్లు అధికారులు ప్రకటించారు. వీటిల్లో 15,800 ఎకరాలను కాల్చి బూడిద చేసిన పాలిసాడ్స్‌ ఫైర్‌ అతిపెద్దది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *