Indian Army: పాక్ వాదనలు పూర్తిగా అబద్ధం: కల్నల్ సోఫియా

భారత సైన్యాని(Indian Army)కి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ పాకిస్థాన్(Pakistan) సాగిస్తున్న దుష్ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. తమ S-400, బ్రహ్మోస్ క్షిపణి(Brahmos missile) వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, పలు వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలపై దాడులు జరిగాయని పాకిస్థాన్ చేస్తున్న వాదనలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఉగ్రవాద శిబిరాల(Terrorist camps)పై భారత్ జరిపిన దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పాకిస్థాన్ ఈ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది.

Image

క్షిపణి స్థావరాలు ధ్వంసం కాలేదు

దీనిపై తాజాగా కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) స్పందించారు. “పాకిస్థాన్ తమ F-17 విమానాలతో మా S-400, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసినట్లు చెప్పుకోవడం పూర్తిగా అవాస్తవం. సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి మా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని వారు చేస్తున్న ప్రచారం కూడా కల్పితమే” అని తెలిపారు. చండీగఢ్, వ్యాస్‌లలోని భారత ఆయుధాగారాలు(Indian arsenals) దెబ్బతిన్నాయన్న పాక్ వాదనలు కూడా పూర్తిగా అబద్ధమని ఆమె కొట్టిపారేశారు.

అంతేకాకుండా, భారత సైన్యం మసీదుల(of mosques)ను ధ్వంసం చేసిందంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను కల్నల్ ఖురేషి తీవ్రంగా ఖండించారు. “భారత్ ఒక లౌకిక దేశమని, మా సైన్యం రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని ఆమె అన్నారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *