BREAKING: మళ్లీ బరితెగించిన పాక్.. సరిహద్దుల్లో డ్రోన్లతో దాడి

పాకిస్థాన్(Pakistan) తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఈరోజు సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire)కు అంగీకరించామంటూనే మరోసారి సరిహద్దుల్లో డ్రోన్లతో దాడుల(Drone Attacks)కు పాల్పడుతోంది. దీంతో జమ్మూకశ్మీర్‌(J&K)లోని శ్రీనగర్‌(Srinagar)లో భారీ పేలుడు శబ్దాలు(Explosive sounds) వినిపిస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడిస్తున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సైతం తాజా డ్రోన్ దాడులపై స్పందించారు. భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని, కాల్పుల విరమణ సంగతేంటని ప్రశ్నించారు.

దీటుగా బదులివ్వాలని సైన్యానికి ఆదేశం

ఇదిలా ఉండగా శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌(Mortar shells)తో పాక్ రేంజర్లు దాడులకు దిగారు. దీటుగా బదులివ్వాలని భారత ప్రభుత్వం BSF‌కు పూర్తి అధికారాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనగర్‌లో బ్లాక్‌‌అవుట్ (Blackout) విధించారు. అటు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా(Baramulla)లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *