పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon sessions of Parliament) జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Parliamentary Affairs Minister Kiren Rijiju) ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశాలు 23 రోజుల పాటు కొనసాగనుండగా, ఆగస్టు 13, 14 తేదీల్లో స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా సెలవు ఉంటుంది. ఈ సమావేశాలు పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack), ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడం విశేషం.
8 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
కేంద్రం ఈ సమావేశాల్లో ఎనిమిది కీలక బిల్లు(Bills)లను ప్రవేశపెట్టనుంది. వీటిలో మణిపూర్ GST (సవరణ) బిల్ 2025, జన్ విశ్వాస్ (సవరణ) బిల్ 2025, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్ 2025, జియోహెరిటేజ్ సైట్స్ అండ్ జియో-రెలిక్స్ (పరిరక్షణ) బిల్ 2025, జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్ 2025 వంటివి ఉన్నాయి. అలాగే, గోవా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య సరిదిద్దడం, ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్ 2025 వంటి బిల్లులు కూడా చర్చకు రానున్నాయి.

ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం
ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, జాతీయ భద్రత(National Security), ఆర్థిక విషయాలపై తీవ్రమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. విపక్షాలు ఈ అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మాపై అభిశంసన తీర్మానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) సిఫార్సుతో ఈ సమావేశాలు జరుగనున్నాయి. లోక్‌సభ(Lok Sabha), రాజ్యసభ(Rajya Sabha) రెండూ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు డిజిటల్ సంసద్ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
Delhi: On the upcoming Monsoon session of Parliament, BJP MP Praveen Khandelwal says, “Parliament sessions are meant for meaningful discussions, but our past experience hasn’t been positive. Opposition parties create disruptions over unnecessary issues and don’t allow Parliament… pic.twitter.com/eLU8uKe2NK
— IANS (@ians_india) July 16, 2025






