తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా, మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప(Kannappa)’. ఈ మూవీని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan in Delhi)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. శివ భక్తుడైన తిన్నడు జీవిత కథ ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Director Mukesh Kumar Singh) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, జూన్ 27న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ మూవీని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించగా, దీనికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మాటల్లో చెప్పలేని గౌరవం దక్కింది..
‘కన్నప్ప’ చిత్రం భక్తి, సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు సినీ నైపుణ్యాన్ని సమన్వయం చేసిందని, మంచు విష్ణు నటన అద్భుతమని అధికారులు కొనియాడారు. ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ (శివపార్వతులు), మోహన్ లాల్ (కిరాతుడు) వంటి తారాగణం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను జోడించింది. కాగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఎపిక్ మూవీ, దృశ్య వైభవంతో పాటు భావోద్వేగ లోతును ప్రదర్శించింది. ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. చిత్ర బృందం సోషల్ మీడియా(SM) వేదికగా ఈ గౌరవాన్ని అభిమానులతో పంచుకుంది. “మాటల్లో చెప్పలేని గౌరవం దక్కింది” అని మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.
Proud moment for Telugu Cinema. #Kannappa, starring #VishnuManchu, was screened at Rashtrapati Bhavan & received rave reviews. Vishnu’s performance is being hailed as one of the most powerful devotional portrayals in recent times. @iVishnuManchu #KannappaMovie pic.twitter.com/zCU2hwwEha
— BA Raju’s Team (@baraju_SuperHit) July 16, 2025






