ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’ (WAR 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే మూవీలో కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కి ఇది సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అటు బాలీవుడ్ అభిమానులతోపాటు, ఎన్టీఆర్ నటిస్తుండడంతో ఇటు తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనున్నారు. తారక్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.

యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై..
ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్(Promotions) మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే ఉందని తెలుపుతూ.. చిత్రం బృందం కౌంట్‌డౌన్ పోస్టర్(Countdown poster)ను విడుదల చేసింది. తాజాగా ఈ పోస్టర్‌ను ‘X’ వేదికగా తారక్ షేర్ చేశారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ(Ayaan Mukharji) దర్శకత్వం వహిస్తుండగా.. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.
The wait ends soon. The war begins… #30DaysToWar2#War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. @iHrithik | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/GocWLNEnSR
— Jr NTR (@tarak9999) July 16, 2025






