టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించినా, కలెక్షన్స్ పరంగా మాత్రం భారీ వసూళ్లు రాబడుతోంది.
ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సక్సెస్ మీట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఒక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. “ఇష్టమైన నటి ఎవరు?”( Favorite Heroine) అనే ప్రశ్నకు ఆలియా భట్(Alia Bhatt), కృతి సనన్(Kriti Sanon), దీపికా పదుకొణె(Deepika Padukone), కియారా అద్వానీ(Kiara Advani)ల్లో ఎవరు అంటే పవన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా “కృతి సనన్”(Kriti Sanon) అని చెప్పారు. ఈ సమాధానం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే, కంగనా రనౌత్ “ఇందిరా గాంధీ” పాత్రలో నటన కూడా తనకు నచ్చిందని చెప్పారు.
పవన్ కళ్యాణ్‌కు అలనాటి అందాల తార శ్రీదేవి నటన అంటే ప్రత్యేకమైన మక్కువ ఉన్నట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత అభిరుచుల గురించి ఇలా అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. పవన్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు షూటింగ్ పనులు త్వరగా పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు.
View this post on Instagram






