Mana Enadu : తిరుమల లడ్డూ (Tirumala Laddu Ghee Issue) తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని తాకింది. పలువురు నటులు ఈ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా ఫైర్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ పై పవన్ ఘాటుగా స్పందించారు. ఇది కాస్త ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
పవన్ వర్సెస్ ప్రకాశ్ రాజ్
హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ తీరుపై ప్రకాశ్ రాజ్ (Prakash Raj Laddu Remarks) తీవ్రంగా స్పందించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనలో అధికారంలో ఉండి చర్యలు తీసుకోకుండా.. దేశవ్యాప్తంగా ఎందుకు చర్చించుకునేలా చేస్తున్నారని ప్రశ్నించారు. ముందు నేరస్థులపై చర్యలు తీసుకోండంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడంతో పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. విషయం తెలియకుండా మాట్లాడకూడదని, సనాతన ధర్మం (Sanatana Dharma) విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలంటూ హితవు పలికారు.
అదేం ఆనందమో?
ఇక పవన్ కల్యాణ్ కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ (Prakash Raj Tweet) ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలే తాను విదేశాల్లో షూటింగుల్లో బిజీగా ఉన్నానని, తాను పెట్టిన ట్వీట్ ను మళ్లీ చదివి సరిగ్గా అర్థం చేసుకోండని పవన్ కల్యాణ్ కు సూచించారు. కొంతసేపటి తర్వాత.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఇంకో ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇక తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్… #justasking
— Prakash Raj (@prakashraaj) September 25, 2024
ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం?
“గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్..?” అంటూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj Latest News) మరో ట్వీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. తాజా కామెంట్స్ కూడా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది. అయితే నెటిజన్లు మాత్రం తిరుమల లడ్డూ వ్యవహారం కాస్త బద్రీ వర్సెస్ నందా ఫైట్ (Badri Vs Nanda) గా మారిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024