ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన(Janasena) పార్టీ అధికారిక ట్విటర్ (X)ద్వారా తెలిపింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు వైద్యులు స్కానింగ్(Scaning) సహా పలు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని… pic.twitter.com/TjeWc4T0WZ— JanaSena Party (@JanaSenaParty) February 22, 2025
పవన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్
అలాగే ఈ నెల చివర్లో గానీ లేదా మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వచ్చే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో(Budget Sessions) పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లు తాజా పోస్టులో తెలిపింది. కాగా పవన్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి(Back Pain)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా పవన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ చేతిలో మూడు సినిమాలు
కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఓజీ(OG), ఉస్తాద్ భగత్ సింగ్(Usthad Bhagat Singh) సినిమాల్లో నటిస్తున్నారు. పొలిటికల్ లైఫ్ కారణంగా వీటి షూటింగ్ లేటవుతోంది. అయితే వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని పవన్ భావిస్తున్నాడు. తొలుత ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేసే పనిలో పవర్‌స్టార్ బిజీగా ఉన్నాడు. కాస్త విరామం దొరికినా చాలు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.






