
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఆయన సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM)గా ప్రజాసేవలో బిజీగా ఉంటూనే మరోవైపు ఈ సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్
ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కు థియేటర్లో అభిమానులు పూనకాలు పెట్టడం ఖాయమంటూ నెట్టింట ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) క్లైమాక్స్ సీన్స్ 42 రోజుల పాటు షూట్ చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కెరీర్ లో చేసిన వాటిలో లాంగ్ షూట్ ఇదేనని తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ తో ఎండ్ అవ్వదని ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నవంబర్ నుంచి ఇరాన్‌లో 8 నిమిషాల పోస్ట్-క్లైమాక్స్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నట్లు టాక్.
మూడో సాంగ్ రిలీజ్ డేట్ లాక్
జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి పార్ట్ మే 9వ తేదీన సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్, “మాట వినాలి”, “కొల్లగొట్టినాదిరో” అనే రెండు సింగిల్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా మూడో సాంగ్ కు కూడా డేట్ లాక్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.