పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్టర్లు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీ జులై 24న పాన్ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఈసందర్భంగా హైదరాబాద్‌లో మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సినిమా కోసం ఇంత కష్టపడ్డాం అని చెప్పడం తనకు తెలియదని, తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని అన్నారు. మరిన్ని విషయాలు పంచుకున్నారు.
సినిమాకు టైం ఇవ్వలేకపోయాను..
“నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. ఈ మూవీ కోసం ఇంత కష్టపడ్డాం అని చెప్పడం నాకు మొహమాటంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఫొటోలు కూడా పేపర్లలో వేయలేదు. దీంతో పబ్లిసిటీ లేకుండానే నా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సినిమా గురించి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో యుద్దాలు చేయాలి. ఈ సినిమా చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంది. నేను పాలిటిక్స్‌కు వెళ్లిపోయిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేకపోయాను. అయినప్పటికీ ఈ మూవీలో నా బెస్ట్ ఇచ్చాను. గతంలో నేను నేర్చుకున్న మార్షల్ఆర్ట్స్ ఈ సినిమాకు ఎంతో పనికి వచ్చింది. ఈ సినిమా కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుంది. క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో ముందుకువచ్చారు. ఆయనకు మా టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు’ అని అన్నారు.
“Nen andarikante munde vachi car lo kurchunanu. Aa time ki vellu leru .. malli nen late ga vaste .. adigo Deputy CM ayyaka .. pogaru ochindi antaru.”
– #PawanKalyan #HariHaraVeeraMallu pic.twitter.com/WSVkvStQHD
— movie lover (@sathish08795444) July 21, 2025
నాకు సినిమా అన్నం పెట్టింది..
‘ఏఎం రత్నం ఎంతో ముందుచూపు ఉన్న నిర్మాత. ఆయన ఈ సినిమా కోసం ఎంతో నలిగిపోయారు. ఈ సినిమా పూర్తవుతుందా, లేదా? అని అనుకున్నప్పుడు దీనికి కీరవాణి ప్రాణం పోశారు. ఒక్కోసారి డబ్బులు, సక్సెస్ కోసం కాదు ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల వెంట నిలవడం ఎంతో ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా ఈ మీటింగ్‌కు వచ్చాను. నాకు సినిమా అన్నం పెట్టింది. సినిమా అంటే నాకు ప్రాణవాయువుతో సమానం. మిగతా హీరోలకు బిజినెస్ అయినంతగా నా సినిమాలకు అవ్వదు. నేను ప్రజల కోసం దృష్టిపెట్టాను. ఈ సినిమా ప్రమోషన్‌ను నిధి అగర్వాల్ (Nidhhi Agharwal) తన భుజాలపై వేసుకుంది’ అని పేర్కొన్నారు.
నా సినిమాకు అండగా ఉండలేనా అనిపించింది..
ఈ సినిమా అనాథ కాదు.. నేనున్నా అని చెప్పడానికే వచ్చాను. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని. దేశ సమస్యల కోసం పోరాటాలు చేసేవాడిని. నా సినిమాకు అండగా ఉండలేనా అనిపించింది. భారతీయ సినిమాకు కుల, మత భేదాలు ఉండవు. క్రియేటివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. చిరంజీవి కుమారుడైనా, తమ్ముడైనా ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలబడలేరు. రేపు నా కుమారుడైనా అంతే. ఇక్కడ ప్రతిభే ముఖ్యం. ఈ సినిమా కోసం తెల్లవారుజామున 2 గంటలకు లేచి కష్టపడేవాడిని. జ్యోతికృష్ణ ఎంతో సత్తా ఉన్న దర్శకుడు. ఈ సినిమా ఫలితం పూర్తిగా ప్రజల చేతిలో ఉంటుంది’ అని పవన్ పేర్కొన్నారు.
#HariHaraVeeraMallu – Pawan Kalyan broke the silence by coming out to a press meet for the first time, supporting his producer AM Rathnam. He says that the film is a massive effort, he shot 57 days for the climax alone! pic.twitter.com/YksFqWxLPa
— Siddarth Srinivas (@sidhuwrites) July 21, 2025






