
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు: పార్ట్-1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari hara Veeramallu: Part-1 Sword vs Spirit)’ సెన్సార్(Censor) పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 42 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా జూలై 24న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అద్భుతమైన VFX, యాక్షన్ సన్నివేశాలు
క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతికృష్ణ(Jyothi krishna) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్. పవన్ కల్యాణ్ ఒక శక్తిమంతమైన యోధుడిగా కనిపించనుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం, అద్భుతమైన VFX, యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
#HariHaraVeeraMallu censor formalities are completed.
Final runtime: 2 hours 42 minutes and 30 seconds.
Postive reports for #HHVM ✅💥 pic.twitter.com/Oc0dg4f9ST
— Nenu_paapini (@relangi_mavaya1) July 14, 2025
ఈ నెల 20న వైజాగ్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం, ఐదేళ్లుగా నిర్మాణంలో ఉంది. వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో పనులు జరిగాయి. ఈ నెల 20న విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event)ను నిర్వహించనున్నారు, ఇందులో SS రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), పాటలు(Songs) అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. పవన్ కల్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రం, థియేటర్లలో అద్భుతమైన అనుభవాన్ని అందించనుందని చిత్ర బృందం పేర్కొంది.