పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’. డైరెక్టర్లు క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ చాలా గ్యాప్ తర్వాత, పైగా AP డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న తొలి మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య(Mughal Empire) కాలంలో జరిగే సంఘటనల ఆధారంగా, ఒక విప్లవాత్మక యోధుడి గాధగా ఈ కథ సాగనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ సూపర్ న్యూస్ బయటికొచ్చేసింది.

షూటింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న భారీ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ(Shooting) ఎట్టకేలకు పూర్తయింది. పలుమార్లు వాయిదాల అనంతరం, ఈ సినిమా షూటింగ్ ఈ వారం హైదరాబాద్‌(Hyderabad)లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ముగిసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త పవన్ అభిమానుల్లో, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా కనిపించనుండగా, ప్రముఖ బాలీవుడ్ నటులు బాబీ డియోల్(Bobby Deol), అనుపమ్ ఖేర్(Anupam Kher) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించగా, ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు.

త్వరలోనే ట్రైలర్, కొత్త పాటలు విడుదల

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్(Post Production Works) షర వేగంగా కొనసాగుతున్నాయట. డబ్బింగ్, రీరికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి భాగాలు త్వరితగతిన పూర్తి చేస్తుండటం విశేషం. వాస్తవానికి మే 9న విడుదల కావాల్సి ఉండగా, పవన్ రాజకీయ కార్యకలాపాలు, సినిమా షూటింగ్ షెడ్యూళ్ల మధ్య సమన్వయం కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయనున్నారు. త్వరలోనే ట్రైలర్(Trailer), కొత్త పాటలు(Songs) విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *