న్యూఢిల్లీ: గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్(Health Insurance clime) పొందాలంటే కనీసం 24 గంటల పాటు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ తాజా వైద్య సాంకేతికత అభివృద్ధితో పాటు మారుతున్న ట్రీట్మెంట్ విధానాల నేపథ్యంలో ఇప్పుడు కేవలం కొన్ని గంటల చికిత్సకు కూడా బీమా కవరేజ్ అందించే విధంగా పాలసీల్లో మార్పులు తీసుకొస్తున్నాయి.
పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్(Palasi Bazar Health Insurance) హెడ్ సిద్ధార్థ్ సింఘాల్(Sidharth Singhal) వివరించినట్లు, “గత పదేళ్లలో ఆరోగ్యరంగం అమితంగా అభివృద్ధి చెందింది. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు, మెరుగైన డయాగ్నొస్టిక్స్ వలన చికిత్స ప్రక్రియ వేగవంతమైంది. ఇది రోగులు ఆసుపత్రిలో గడిపే సమయాన్ని గణనీయంగా తగ్గించేసింది.” గతంలో కంటిశుక్లం తొలగింపు, కీమోథెరపీ, యాంజియోగ్రఫీ వంటి చికిత్సలకు రాత్రిపూట హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇవన్నీ కొన్ని గంటల్లోనే పూర్తి అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీల్లో 24 గంటల హాస్పిటలైజేషన్ నిబంధనను తొలగించి, షార్ట్-టర్మ్ హాస్పిటల్ స్టేకు కూడా కవరేజ్ ఇస్తున్నాయి. దీని వల్ల 2–3 గంటల( Two Hour Hospital Stays) చికిత్సైనా బీమా క్లెయిమ్(Bhima Clime) తీసుకునే వీలుంటుంది. అదనంగా ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేకుండా ఈ ప్రయోజనం అందుతోంది.
ఇలాంటి క్లెయిమ్ సదుపాయం కలిగిన ప్రాముఖ్యమైన ప్లాన్‌ల్లో ఐసీఐసీఐ లొంబార్డ్ ఎలివేట్ ప్లాన్ (ప్రీమియం రూ.9,195), కేర్ సుప్రీం ప్లాన్ (రూ.12,790), నివా బూపా హెల్త్ రీఅష్యూర్ ప్లాన్ (రూ.14,199) ఉన్నాయి. ఈ ధరలు 30 ఏళ్ల వయస్సు గల, పొగ తాగని, మెట్రో నగరాల్లో నివసించే వ్యక్తికి వర్తిస్తాయి.






