దేశంలోని రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (Pm Samman Nidhi) యోజన 20వ విడత నిధులను విడుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి సేవాపురిలో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను ప్రధాని అధికారికంగా రిలీజ్ చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేల ఆర్థిక సాయం అందుతుంది. ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అంతకుముందు, జూన్ 18, 2024న, ప్రధానమంత్రి మోదీ రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేశారు.
రూ.2,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వారణాసి పర్యటనలో భాగంగా మోదీ దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభాలతోపాటు శంకుస్థాపన చేశారు. రోడ్లు, హాస్పిటల్స్, స్కూళ్లు సహా రకరకాల మౌలిక సదుపాయాలున్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచబోతున్నాయని ప్రధాని (PM Modi) తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులు రైతుల జీవితాలు, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఫసల్ బీమా ద్వారా రూ.1.75 లక్షల కోట్ల క్లెయిమ్‌లు
రైతులకు నగదు విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (Fasal Bima Yojana) పథకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా పంటకు నష్టం జరిగితే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్‌లు ఇచ్చినట్లు తెలిపారు. పంట బీమా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు.






