పుతిన్​తో మోదీ భేటీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Mana Enadu : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. తామంతా చేసే ప్రయత్నాలు మానవత్వానికి ప్రాధాన్యమిస్తాయని తెలిపారు. రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారానికి సాధ్యమైన సహకారం అందించడానికి భారత్​ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.

పుతిన్ తో మోదీ భేటీ

16వ బ్రిక్స్ సదస్సు(16th BRICS summit)లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (అక్టోబర్ 22వ తేదీ 2024) రష్యాలోని కజాన్ చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)తో ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్ తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మరోసారి చర్చించారు.

రష్యా-ఉక్రెయిన్ సమస్యపై మేం దృష్టి పెట్టాం

ఇరు దేశాల మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము నమ్ముతున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్ సమస్య(Russia Ukraine War)పై తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇక పుతిన్ తో భేటీ అనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇతర దేశాధినేతలతో ప్రధాని సమావేశం కానున్నట్లు సమాచారం.

ఇక మనకు అనువాదం అవసరం లేదు

మరోవైపు పుతిన్ మాట్లాడుతూ.. “జులైలో మనం కలిసి మాట్లాడిన విషయం నాకు గుర్తుంది. పలు సమస్యలపై నిర్ణయాలు తీసుకున్నాం. నా ఆహ్వానం మన్నించి కజాన్​కు మీరు రావడం గొప్ప విషయం. ఇక ఇరు దేశాల (India Russia) మధ్య ఉన్న సబంధాలకు అనువాదం అవసరం లేదని నాకు అనిపిస్తుంది.” అని పుతిన్ అన్నారు. అనంతరం ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించారు.

Share post:

లేటెస్ట్