ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రపంచ, భారత్‌లోని పలు రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యేకంగా మాట్లాడారు. WAVES (World Audio Visual & Entertainment Summit) సమ్మిట్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో భాగంగా దీనిని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాల అగ్రశ్రేణి నిపుణులు, అత్యున్నత ప్రముఖులతో ప్రధాని మోదీ వర్చువల్ ఇంటరాక్షన్ సెషన్(Virtual interaction session) నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలను అడిగితెలుసుకున్నారు. ఆవిష్కరణలు(Innovations), ప్రపంచ నాయకత్వం, భారతదేశం సాంస్కృతిక, సాంకేతిక ప్రభావం(Technology), ప్రపంచ వేదికపై దేశం స్థానాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
పీఎం వర్చువల్ ఇంటరాక్షన్ సెషన్ వీరితోనే..
కాగా మోదీ సంభాషించిన ప్రముఖులలో నటులు బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), దిల్జిత్ దోసాంజ్, రజినీకాంత్(Rajinikanth), షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, ఎఆర్ రెహమాన్ తోపాటు పలువురు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఉన్నారు.. వారితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ(Mukesh Ambani), మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఉన్నారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు భారత్ మొదటి వరల్డ్ ఆడియో-విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
#WATCH | PM Narendra Modi interacted with top professionals from India and the World who are a part of the Advisory Board of WAVES Summit, including actors Amitabh Bachchan, Diljit Dosanjh, Rajnikanth, Shah Rukh Khan, Ranbir Kapoor, Chiranjeevi, Anil Kapoor, Akshay Kumar, Anupam… pic.twitter.com/CXmWCXKeZS
— ANI (@ANI) February 7, 2025








