EK Police System: ఏక్ పోలీస్ విధానం కావాల్సిందే.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆందోళన

Mana Enadu: రాష్ట్రంలో ‘ఏక్‌ పోలీస్‌(Ek Police)’ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్‌ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు(Constables) ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. సీఎం రేవంత్‌ సర్కార్‌(Cm Revanth Govt) అనాలోచిత నిర్ణయాలపై వారు మండిపడ్డారు. వరంగల్‌(WGL)లోని మామునూరు ఫోర్త్‌ బెటాలియన్‌లో ఆందోళనకు దిగారు. బెటాలియన్‌ కమాండెంట్‌ ఆఫీస్‌ ముందు బైఠాయించారు. ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అటు హైదరాబాద్(HYD), కరీంనగర్‌(KNR)లలోనూ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. కాగా పోలీసుల నిరసన వీడియోలను BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) ట్విటర్‌(X)లో షేర్ చేశారు.

 ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్

మరోవైపు నల్లగొండ జిల్లా అన్నెపర్తి బెటాలియన్‌(Anneparthi Battalion)లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ రూరల్‌ SI సైదాబాబును సస్పెండ్‌(Suspend) చేయాలని నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడని ఆరోపించారు. తక్షణమే సైదా బాబుని సస్పెండ్ చేయాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అయితే బందోబస్తు విధుల్లో ఉన్న సైదాబాబు వద్దకు కానిస్టేబుళ్లు రావడంతో.. బెటాలియన్‌ అధికారులు అతడిని అక్కడిని నుంచి పంపించేశారు.

 ప్రభుత్వం తాత్కాలిక నిర్ణయం

తెలంగాణలో గత కొన్నిరోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలు చేస్తున్నారు. తమ భర్తలను ఒక చోట ఉంచకుండా పదే పదే వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారని, వాళ్లని కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. పోలీసులకు దక్కిన గౌరవం కూడా తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనలు ఉద్ధృతం కావడం వల్ల పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ(Police Department) తాత్కాలికంగా నిలిపివేసింది.

Share post:

లేటెస్ట్