పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Mana Enadu : తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) షాక్ ఇచ్చింది. బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల ఆందోళన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకుంది. మొత్తం 39 మంది బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణగా ఉండాల్సిన శాఖ(Telangana Police)లో పని చేస్తూ ఆందోళనకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

చెప్పినా ఆందోళనలు ఆపలేదు

గత నాలుగైదు రోజులుగా కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్లపై బైఠాయించి ధర్నాలు(Constable Protests) చేస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సెలవుల విషయంలో ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, ఇంకేమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీజీపీ జితేందర్(Telangana DGP Jithender) చెప్పినా వారు ఆందోళనలు చేయడంపై ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. ఇలాగే కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

39 కానిస్టేబుళ్లపై వేటు

“ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నాం. సస్పెన్షన్​కు గురైన వారిలో 3వ బెటాలియన్​కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, 4వ బెటాలియన్​లో ఆరుగురు, 5వ బెటాలియన్​లో ఆరు, 6వ బెటాలియన్​లో ఐదుగురు, 12వ బెటాలియన్​లో ఐదుగురు, 13వ బెటాలియన్​లో ఐదుగురు, 17వ బెటాలియన్​లో ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తూ ఆందోళనల ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించం.” అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

 

Share post:

లేటెస్ట్