భక్తులకు గుడ్ న్యూస్.. మేడారం జాతర తేదీలు ఖరారు

Mana Enadu : తెలంగాణ కుంభమేళగా పేరు గాంచింది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jatara). ప్రతి రెండేళ్లకోసారి మహా జాతరగా, ఏడాదికోసారి మినీ జాతర జరుపుకుంటాం. తాజాగా ఈసారి సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. 2025 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు

మినీ మేడారం జాతర(Medaram Mini Jatara)లో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారన్న విషయం తెలిసిందే. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేయగా.. భక్తులు గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే తేదీలు ఖరారు చేసిన అనంతరం పూజారులు ఆలయ ఈవోకు ఆహ్వాన పత్రం పంపారు. మినీ మేడారం జాతర(Sammakka Saralamma)కు కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

దేశ నలుమూలల నుంచి రానున్న భక్తులు

ఇక సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర(Maharashtra), ఒడిశా, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మేడారం జన జాతరను 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరిగే మినీ జాతరకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు, రవాణా, భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

ఇదీ మేడారం జాతర కథ

కాకతీయ రాజ్య సైన్యం గిరిపుత్రులను వేధిస్తుంటే సమ్మక్క సారలమ్మ కత్తిపట్టి కదనరంగంలోకి దూకి వారి అంతుచూశారు. ఆ క్రమంలో వారు వీరమరణం పొందడంతో వారి త్యాగానికి నీరాజనాలు పలుకుతూ గిరిజనులు వారిని దేవతలుగా పూజిస్తూ మేడారంలో జాతర(Sammakka Saralamma Jatara) నిర్వహిస్తున్నారు. అయితే 1944 వరకు ఆదివాసి గిరిజనులకే ఈ జాతర పరిమితమైంది. క్రమంగా మేడారం మహత్యం, సమ్మక్క సారలమ్మల మహత్యం గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మేడారం జాతర జనసంద్రంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *