పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత.. ప్రపంచ దేశాల ప్రముఖుల సంతాపం

కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) (Pope Francis) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు ఆయన తుదిశ్వాస విడిచారు.  గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడిన ఆయన ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయన ఇటీవల డిశ్చార్జి అయ్యారు. 2013లో పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత ఫ్రాన్సిస్‌ ఈ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Image

ప్రజల పోప్.. ఫ్రాన్సిస్

1938లో అర్జెంటీనాలో జన్మించిన ఫ్రాన్సిస్‌ .. దక్షిణ అమెరికా (South America) నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తిగా నిలిచారు.  ఫ్రాన్సిస్ ను ప్రజల పోప్‌ అంటారు. తరచూ సామాజిక అంశాలపైనా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇక మరణానికి కొన్ని గంటల ముందు ఈస్టర్‌ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు.  సంక్షోభాలతో రగులుతున్న గాజా (Israel Gaza War), ఉక్రెయిన్‌ (Ukraine Peace), కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు.

ప్రపంచ ప్రముఖుల సంతాపం

పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త విని ప్రపంచ దేశాల నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi On Pope) పోప్ మరణం చాలా బాధాకరం అంటూ తన సంతాపాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎన్నో కోట్ల మంది కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ఫ్రాన్సిస్ ప్రతీకగా గుర్తుండిపోతారని మోదీ అన్నారు. పోప్ తో తాను భేటీ అయినప్పుడు అన్నివిధాలా,  సమ్మిళిత అభివృద్ధి విషయంలో నిబద్ధత నన్ను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. భారతీయులపై ఆయన అభిమానం ఎంతో విలువైందని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.

ఆయన ప్రసంగాలు అద్భుతం

మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) కూడా పోప్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ ను ఆయన నిన్నే కలిశానని తెలిపారు. కరోనా సమయంలో ఆయన ప్రసంగాలను తాను మరిచిపోలేనని.. అవి చాలా అద్భుతమైన జేడీ వాన్స్ గుర్తు చేసుకున్నారు. మరోవైపు పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణానికి  ప్రపంచం సంతాపం తెలియజేస్తోందని.. విధివంచితుల విషయంలో ఆయన ప్రేమ, మానవత్వం కేథలిక్‌ ప్రపంచానికి వెలుపల కూడా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిందని ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *