Mana ENadu : తెలుగులో యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది అనన్య నాగళ్ల(Ananya Nagalla). ఈ ఏడాది తంత్ర, పొట్టేల్(Pottel)తో పాటు డార్లింగ్(Darling) సినిమాలు చేసింది. తెలుగు వెబ్‌సిరీస్ బహిష్కరణలో కీలక పాత్ర చేసింది. తాజాగా అనన్య నాగళ్ల(Ananya Nagalla) హీరోయిన్గా నటించిన తెలుగు మూవీ పొట్టేల్(Pottel) ఓటీటీ(OTT)లోకి వస్తోంది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్(Telangana Backdrap)లో క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సాహిత్ మొత్కూరి(Sahit Mothkhuri) దర్శకత్వం వహించాడు. యువచంద్ర(Yuva Chandra) హీరోగా నటించిన ఈ మూవీలో అజయ్(Ajay), నోయల్(Noel) కీలక పాత్రల్లో నటించారు.
రిలీజైన రెండు నెలల తర్వాత
థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత పొట్టేల్ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime)తో పాటు ఆహా ఓటీటీ(Aha Ott)లో ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్ సెకండ్ వీక్ లేదా మూడో వారంలో పొట్టేల్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్(Official announcement) రానున్నట్లు తెలిసింది.
కూతురి చదువు కోసం…
తన కూతురి చదువుకు, 1970 -80 కాలం నాటి సామాజిక కట్టుబాట్ల(To social commitments)కు మధ్య నలిగిపోయిన ఓ తండ్రి కథకు ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి పొట్టేల్ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సాహిత్ మొత్కూరి. అజయ్, యువచంద్ర, అనన్య నాగళ్ల యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ చిన్న సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రమోషన్స్ డిఫరెంట్‌గా చేయడం, యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా(Sandeep Reddy Vanga)తో పాలు పలువురు సెలబ్రిటీలు ఈ ప్రమోషన్స్(Promotions)లో భాగం కావడం పొట్టేల్కు కలిసివచ్చింది.






