న్యూ ఇయర్​ రోజు ఈ మంత్రాలు పఠిస్తే.. ఏడాదంతా అదృష్టం మీ సొంతం

Mana Enadu : కొత్త ఏడాది 2025 (New Year 2025) వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. డిసెంబరు 31వ తేదీన పార్టీ మోడ్ లో ఉన్న వారంతా జనవరి 1వ తేదీన ఉదయాన్నే లేచి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దేవుళ్లకు పూజలు చేస్తూ ఈ ఏడాదంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు.

కొత్త ఏడాదిన పఠించాల్సిన మంత్రాలు

కొంతమంది ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1వ తేదీన కొన్ని మంత్రాలు జపించడంతో ఈ సంవత్సరమంతా అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.  మీరు కూడా ఆ మంత్రాలు జపించి ఈ ఏడాదంతా శుభం కలగాలని ప్రార్థించండి. మరి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మహాగణపతి మంత్రాలు

కొత్త ఏడాదిన ఆది దేవుడు అయిన మహాగణపతికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘గం క్షిప్ర ప్రసాదనాయ నమః’ మంత్రాన్ని జపిస్తే కోరుకున్నవి జరుగుతాయని తెలిపారు. ఈ మంత్రాన్ని 108, 54, 21 సార్లు మనసులో జపించాలని సూచించారు. న్యూ ఇయర్ రోజున వినాయకుడి అనుగ్రహం కోసం ‘సంకట నాసిక గణేశ స్తోత్రం’ చదవడం కూడా శుభకరమని చెబుతున్నారు పండితులు.

విష్ణుమూర్తిని స్మరించుకోండి 

విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కొత్త ఏడాది రోజున  ‘ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. అదే కాకుండా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ‘విష్ణు సహస్రనామం’ , విష్ణు పంజర స్తోత్రం పఠించడం వల్ల శత్రు బాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ల ఎడుపులు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు.

Related Posts

Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం

ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *