టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) జూన్ 20న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ విజయపథంలో దూసుకెళ్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘పోయిరా మామ’ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ వీడియో సాంగ్‌ను ఆదిత్య మ్యూజిక్ మరియు యూట్యూబ్‌లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కంటెంట్ పరంగా నిండుగా ఉండే ఈ చిత్రం, థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ, టీవీ వేదికగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.






