(Ravi Teja: అత్యాధునిక టెక్నాలజీతో రవితేజ మల్టీప్లెక్స్ ఓపెనింగ్.. పవన్ కల్యాణ్ సినిమాతో లాంచ్

టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో పాటు థియేటర్ బిజినెస్‌లోనూ అడుగుపెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu) (ఏఎంబీ)(AMB), అల్లు అర్జున్(Allu Arjun) (ఏఏఏ)(AAA) అలాగే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) (ఏవీడీ)(AVD) మల్టీప్లెక్స్‌( Multiplex)లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మాస్ మహరాజా రవితేజ కూడా అదే బాటలోకి వెళ్లారు.

హైదరాబాద్(Hydarabad) శివారులోని వనస్థలిపురం(Vanasthalipuram)లో రవితేజ(Ravi Teja), ఏసియన్(Asian) సంస్థ కలసి నిర్మిస్తున్న మల్టీప్లెక్స్(Multiplex) నిర్మాణం దాదాపు పూర్తయింది. ‘ఏఆర్ టీ మల్టీప్లెక్స్'( ‘ART’ Multiplex)గా పేరుపొందబోయే ఈ థియేటర్‌ ప్రస్తుతం ఇంటీరియర్ పనులతో చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోంది.

ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)తో ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం (July 24)జూలై 24న విడుదల కాబోతున్న నేపథ్యంలో, అదే రోజున థియేటర్ ప్రారంభం జరిగే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికత(Ultra-Modern Multiplex )తో తీర్చిదిద్దారు. సుమారు 57 అడుగుల వెడల్పు కలిగిన భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, టిక్ ఎక్స్‌పీరియన్స్ వంటి ఫీచర్లు ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *