పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం 8 సినిమాలున్నాయి. అందులో ఒకటి కన్నడ స్టార్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మ (Prashant Varma) డైరెక్షన్ లో వస్తున్న సినిమా. బ్రహ్మరాక్షస్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కు కథ వినిపించగా.. డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ లుక్ టెస్టు కూడా అయిపోయిందట. తాజాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అనౌన్స్మెంట్ వీడియో రెడీ
ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారంకంగా ప్రకటన రానున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందుకోసం ప్రశాంత్ వర్మ అనౌన్స్మెంట్ వీడియో కూడా రెడీ చేస్తున్నాడట. ఇటీవలే ప్రభాస్ కు లుక్ టెస్టు చేసిన వర్మ.. హనుమాన్ స్టూడియోలో అనౌన్స్మెంట్ వీడియో కోసం మూడ్రోజులు షూటింగ్ జరిపారట. అందులో రెండ్రోజుల పాటు ప్రభాస్ (Prabhas Movies) పాల్గొన్నాడట. అనౌన్స్ మెంట్ కోసం వీడియో, ఫొటోషూట్ చేశారట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి.. ఉగాది కానుకగా ఈ సినిమా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
డేట్స్ కుదిరేనా?
అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కాంతార ఫేం రిషభ్ శెట్టితో కలిసి జై హనుమాన్ (Jai Hanuman) చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రిషభ్ ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో జై హనుమాన్ కు ఇంకా డేట్స్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా షూటింగు వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకున్న ప్రశాంత్ వర్మ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ (The Raja Saab), ఫౌజీ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి-2 చిత్రాలు రెడీగా ఉన్నాయి. మరి ప్రశాంత్ వర్మకు డార్లింగ్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.






