The Raja Saab : రాజాసాబ్ ఎప్పుడొస్తారు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో జోరు సాగిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ (Spirit), సలార్-2, కల్కి-2 ఉన్నాయి. ఇక తాజాగా ఆయన కన్నడ స్టార్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)తో మరో మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలిసింది. అంటే మొత్తం ప్రభాస్ చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. ఈ ఎనిమిది పాన్ ఇండియా చిత్రాలే. అయితే ఇవి ఒక్కొక్కటి రిలీజ్ అవ్వడం మొదలు పెడితే.. 2025, 2026, 2027, 2028 ఇలా వరుసగా నాలుగైదేళ్లు ప్రభాస్ చిత్రాలు థియేటర్లో సందడి చేస్తూనే ఉంటాయి.

ఇంకా షూటింగు కాలేదట 

అయితే ఈపాటికే ప్రభాస్ సినిమా ఈ ఏడాది థియేటర్లో విడుదల కావాల్సింది. మారుతి (Maruthi) దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab) ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీలో పాటల షూటింగ్ పెండింగులో ఉందనే టాక్ వినిపిస్తోంది.

రాజాసాబ్ సాంగ్స్ షూట్

ది రాజాసాబ్ మూవీలో పాటల షూటింగు కోసం లొకేషన్లు కూడా ఇంకా డిసైడ్ చేయలేదని సమాచారం. ఆ లొకేషన్లు ఎప్పుడు డిసైడ్ చేస్తారో..? సాంగ్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో..? ట్రైలర్(Raja Saab Trailer) రిలీజ్ ఎప్పుడు ఉంటుందో..? మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందోనని ప్రేక్షకులు వేయికన్నులతో వేచిచూస్తున్నారు. అయితే ఏప్రిల్ లో ఈ చిత్రం రిలీజ్ ఉంటుందని మొదట ప్రకటించారు. కానీ ప్రభాస్ డేట్లు దొరకకపోవడం, సర్జరీ అంటూ విశ్రాంతి తీసుకోవడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడుతూ వచ్చిందట. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట రాజాసాబ్ ఎప్పుడొస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *