భారీ అంచనాల మధ్య జూన్ 27న రిలీజ్ అయ్యింది కన్నప్ప (Kannappa) మూవీ. గత చిత్రాలు డిజాస్టర్ కావడంతో మంచు విష్ణు (Manchu Vishnu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరపైకి తీసుకొచ్చారు. దానికి ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preethi Mukundan) ఎక్కడా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. కనీసం సినిమా గురించి ఏ పోస్ట్ కూడా చేయలేదు. దీంతో కన్నప్ప టీంకి, ఆమెకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయని, అందుకే టీమ్‌తో ఆమె దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు ప్రీతి ముకుందన్ సోషల్ మీడియా(SM)లో కన్నప్ప గురించి పోస్ట్(Post) వేశారు. కన్నప్ప మూవీలో క్యారెక్ట్ ఫొటోను షేర్ చేస్తూ ప్రేక్షకులు, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది. అయితే ఎక్కడా సినిమా పేరును కానీ, విష్ణు, మోహన్ బాబు పేరును మెన్షన్ చేయలేదు.

నిద్రలేని రాత్రులెన్నో గడిపాను..
‘జీవితంలో కొన్ని సార్లు కొన్ని అనుభవాల్ని చెప్పడానికి పదాలు కూడా సరిపోవు.. ఊహించనంత ప్రేమ మనల్ని చుట్టుముట్టినప్పుడు మాటలు రావు.. గత కొన్ని రోజులుగా నాకు సరిగ్గా అలాగే అనిపిస్తోంది. నా మీద ఇంత ప్రేమను కురిపించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. మీ మాటలు, ప్రశంసలు, పొగడ్తలు నన్ను ఎంత సంతోషపెట్టాయో చెప్పలేను. ఓ ఆరు నెలలు నేను ఆ క్యారెక్టర్లో జీవించాను.. ఆ క్యారెక్టర్‌తోనే ప్రయాణం చేశాను. ఆ పాత్ర కోసం ఎన్నో డిఫరెంట్ స్కిల్స్(Different skills) నేర్చుకున్నాను. నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ పనిచేశాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.
వారందరి దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నా..
నా మొదటి సినిమాతోనే భారత సినీ పరిశ్రమలోని ఎంతో మంది గొప్ప నటీనటులతో పని చేసే అవకాశం వచ్చింది. వారందరి దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నా. వారితో పని చేసిన రోజులు,ఆ జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఈ ప్రయాణంలో చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నా. అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలుసుకున్నా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినే. నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని పేర్కొన్నారు.
View this post on Instagram








