
అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు. కాగా ప్రధాని రాకను పురస్కరించుకుని గన్నవరం విమానాశ్రయం పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. దాదాపు 1,400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతను 15 సెక్టార్లుగా విభజించి, ఒక్కో సెక్టార్‌కు SP, ASP స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. అటు ప్రధాని పర్యటన ముగిసే వరకు కార్గో సేవల(Cargo Service)ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రధాని షెడ్యూల్ ఇలా..
షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో అమరావతిలోని వెలగపూడికి బయలుదేరి వెళతారు. అక్కడ రాజధాని అమరావతి(Capital Amaravati)లో సుమారు రూ. 49 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు వేదిక మీద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan), స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 5.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ(Delhi)కి పయనమవుతారు.