తిరుమల భక్తులకు అలర్ట్. త్వరలోనే శ్రీవారి స్వచ్ఛంద సేవ(Tirumala Srivari Seva Tickets)ల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచనల మేరకు టీటీడీ.. ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ(పుట్టపర్తి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్) వంటి సంస్థలను సందర్శించి అధ్యయనం చేసింది. మార్పులకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీన జూన్ నెల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
మే 30న టికెట్లు విడుదల
తిరుమల (Tirumala Temple News), తిరుపతికి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవా టికెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మహిళలకు నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పురుషులకు పరకామణి సేవ ఒంటి గంటకు, కొత్తగా ప్రారంభించిన గ్రూప్ లీడ్సేవకు సంబంధించిన టికెట్లు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయనున్నారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు (45-70 సంవత్సరాల వయసు ఉన్నవారు) 15 రోజులు, నెల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.






