పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu): పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ థియేటర్లలో విడుదలై, మంచి స్పందన పొందుతోంది. ఈ సినిమాకోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ఒక పండగలా మారింది.
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ యోధుడి పాత్రలో అదరగొట్టాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి సీన్ నుంచి పవన్ ఎంట్రీ వరకూ థియేటర్లలో హోరెత్తే రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి((Krish Jagrlamudi)) విజన్‌కు, సినిమా విజువల్ ప్రెజెంటేషన్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సెట్స్, కాస్ట్యూమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను గ్రాండ్‌గా చూపించాయి. సినిమా ప్రారంభం నుంచీ ముగింపు వరకు ఎక్కడా బోర్ కొట్టలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంఎం కీరవాణి(MM. Keeravani) అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని విశేషంగా ప్రశంసిస్తున్నారు.
సినిమాలో ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేయడంతో పాటు, పార్ట్ 1లో కేవలం పాత్రల పరిచయం, పునాది వంటి అంశాలను చూపించారని, పార్ట్ 2లో వీటి పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని టాక్. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్లు, ఎలివేషన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయని వారు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన ఎక్స్‌పీరియన్స్‌ని కలిగిస్తుందంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
థియేటర్ల వద్ద ఊహించని స్థాయిలో జోష్ కనిపించింది. బ్యానర్లు, బాణసంచాలు, DJ సౌండ్స్‌తో పవన్ అభిమానులు సినిమా రిలీజ్‌ను పండగలా మార్చేశారు. సోషల్ మీడియాలో కూడా “పవర్ స్టార్ మాస్ వేరియేషన్ చూపించాడు”, “ఈ సినిమా ఫ్యాన్స్‌కి ఒక మేజిక్ మోమెంట్” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా హరి హర వీరమల్లు సినిమాపై పబ్లిక్ టాక్ పాజిటివ్(Public Talk on Hari Hara Veera Mallu)గా నిలుస్తోంది. పార్ట్ 2పై అంచనాలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి!






