ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో పంజాబ్ రెండు మార్పులు చేసింది. జోస్ ఇంగ్లిష్, జేవియర్ బార్ట్‌లెట్ జట్టులోకి వచ్చారు. అటు కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మోయిన్ అలీ స్థానంలో ఎన్రిచ్ నోర్ట్జే జట్టులోకి వచ్చాడు.
A.Nortje IN
Moeen Ali OUT#PBKSvsKKRpic.twitter.com/aJR4acUdGr
— Cricket Telugu (@CricketInTelugu) April 15, 2025
ఎవరు గెలిచినా టాప్-3లోకి
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌లు గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. +0.803 నెట్ రన్‌రేట్ 6 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి, రెండు ఓడింది. +0.065 రన్‌రేట్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ టాప్ 3లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.
తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (Wk), శ్రేయాస్ అయ్యర్ (C), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(సి), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చకరవర్తి






