
Gటాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూస్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. దిల్‌రాజు(Dil Raju). 1997లో ‘పెళ్లి పందిరి(Pelli Pandiri)’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2003లో దిల్(Dil) సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా విజయం సాధించడంతో ఆ సినిమా పేరునే ‘దిల్ రాజు’గా మార్చుకున్నారు. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్(SVC)పై అనేక చిత్రాలను నిర్మించి సినీరంగంలో అగ్ర నిర్మాతగా మారారు. సినీరంగంలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్(Dil Raju Dreams) పేరుతో కొత్త బ్యానర్‌ను ఏర్పాటు చేశాడు.
ఓవైపు నిర్మతగా.. మరోవైపు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా
ఓ వైపు వరుస సినిమాలను లైన్లో పెడుతూనే మరోవైపు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(FDC)కి ఛైర్మన్‌గానూ కొనసాగుతున్నారాయన. టాలీవుడ్ నిర్మాత(Tollywood Producer)ల్లో ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదంటే అవుననే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ‘X’లో మంగళవారం సాయంత్రం ఓ ఓ పోస్టు పెట్టారు. ఏప్రిల్ 16న బుధవారం ఉదయం 11.08గంటలకు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందని దాని సారాంశం. దీంతో దిల్ రాజు బుధవారం ఏం ప్రకటించబోతున్నారో అంటూ టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.
BOLD. BIG. BEYOND IMAGINATION. ❤️🔥❤️🔥❤️🔥
Blockbuster Producer #Dilraju‘s BIG ANNOUNCEMENT TOMORROW, APRIL 16th at 11:08 AM 🎯
Stay tuned 💥 pic.twitter.com/JjhTwibxda
— Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2025
అందరిలోనూ ఉత్కంఠ
ఏదైనా పెద్ద హీరోతో సినిమా ప్రకటించబోతున్నారా.. లేక బిజినెస్‌కి సంబంధించి మరేదైనా కీలక ప్రకటన ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దిల్ రాజు అనౌన్స్ చేయబోయేది ఓ AI బేస్డ్ టెక్నికల్ కంపెనీతో ఒప్పందం గురించట. సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే ఈ సంస్థతో దిల్ రాజు భారీ ఒప్పందం చేసుకున్నారని సమాచారం. మరి ఆయన ఏం చెప్తారనేది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనూ.. ఇటు ఫ్యాన్స్‌లోనూ ఉత్కంఠ నెలకొంది.