
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత లాభం కోసం అమాయకులు మోసపోయేలా ప్రేరేపిస్తున్న పలువురు సెలబ్రిటీలపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా.. వీరి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానలేదు.
సెలబ్రిటీలపై కేసు నమోదు
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సోషల్ మీడియా, టీవీ నటులపై పంజాగుట్ట కేసులు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టెస్టీ తేజ (Tasty Teja), కిరణ్ గౌడ్, విష్ణుప్రియ (Vishnu Priya), యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ లపై కేసు ఫైల్ చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.