Mana Enadu : ‘పుష్ప.. పుష్ప.. పుష్ప’.. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ హవానే. సోషల్ మీడియాలో అయితే పుష్ప వైల్డ్ ఫైర్ మామూలు ట్రెండింగ్ లో లేదు. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ ముందు చెప్పినట్లుగానే పుష్పరాజ్ మేనియా వరల్డ్ వైడ్ గా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’ సినిమా ఇవాళ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. ఈ సినిమాలో బన్నీ, రష్మిక నటనకు.. సుకుమార్ టేకింగుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రూ.400 కోట్లతో పుష్ప-2
ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించగా.. విలన్ గా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఆకట్టుకుంటున్నాడు. ఇక జగపతి బాబు, రావు రమేశ్, జగదీశ్, సునీల్, అనసూయ ఇతర పాత్రల్లో సందడి చేశారు. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ రోజే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి రూ.400 కోట్ల వరకు బడ్జెట్ (Pushpa 2 Budget) పెట్టినట్లు తెలిసింది. మరి ఈ సినిమాలో నటించిన వారు ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందామా..?
ఐకాన్ స్టార్ పారితోషికం
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ ఫస్టాఫ్ లో.. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ సినిమాపై హైప్ పెంచేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చెప్పినట్లుగానే సినిమాలో తన నటవిశ్వరూపంతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. అయితే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యునరేషన్ (Allu Arjun Remuneration) తీసుకున్నాడని టాక్. ఇది ఫస్ట్ కలెక్షన్లతో సమానంగా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
రష్మిక.. శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే
ఇక శ్రీవల్లిగా తన అందం నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది నషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఈ భామ ఈ చిత్రం కోసం పార్ట్-1 కంటే ఎక్కువగా దాదాపు రూ.2 కోట్లు తీసుకుందని సమాచారం. పుష్పరాజ్ కు దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విలనిజం పండించాడు భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్. ఈయన ఈ చిత్రానికి రూ.8 కోట్లు అందుకున్నట్లు టాక్. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల (Sreeleela Pushpa 2) రూ.2 కోట్లు తీసుకుందట.






