Mana Enadu : సినిమా రిలీజ్ కూడా కాలేదు అయినా పుష్పరాజ్ రికార్డులు బ్రేక్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సేల్స్ లో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవ్వడంతో ఈ మూవీ (Pushpa 2 The Rule) సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది.
ఉత్తరాదిన పుష్ప రాజ్ రూలింగ్
ఓవర్సీస్లో ప్రీ సేల్ బుకింగ్స్ (Pushpa Pre Sale Bookings)లో హవా చూపిన పుష్ప.. ఉత్తరాదిన కూడా సత్తా చాటుతోంది. హిందీ వెర్షన్లో టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే 24 గంటల్లో లక్ష టికెట్స్ అమ్ముడుపోయాయి. బాలీవుడ్లో స్త్రీ2 (41k), డంకీ (42k), యానిమల్ (52.5k), టైగర్3 (65k) సినిమా రికార్డులను ‘పుష్ప2’ బ్రేక్ చేసింది. ప్రీసేల్ బుకింగ్స్‌లో ఇప్పటివరకు రూ.60కోట్లకు పైగా వసూలు చేసి ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’, ‘కేజీఎఫ్-2 (KGF 2)’ల తొలి రోజు వసూళ్లను ‘పుష్ప2’ దాటేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడే
మరోవైపు రిలీజ్ కు ఇంకా మూడ్రోజులే సమయం ఉండటంతో ‘పుష్ప-2 (Pushpa 2 Promotions)’ టీమ్ ప్రచారంలో జోరు పెంచింది. ముంబయి, కొచ్చిలలో ఈవెంట్లు నిర్వహించిన టీమ్ ఇవాళ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎవరు హాజరవుతారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఈవెంట్ లో పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ ఎంట్రీని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
శ్రీలీల – పుష్పగాడి డ్యాన్స్ అదుర్స్
ఇక పుష్ప-2 సినిమా సంగతికి వస్తే సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. మలయాళం స్టార్ హీరో ఫహాజ్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సునిల్, అనసూయ, శ్రీలీల (Sreeleela) ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీలీల ఈ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాట ఈ చిత్రానికే హైలైట్ గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.






