పుష్పరాజ్ రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. నేటి నుంచి (జనవరి 17) సెలక్టెడ్ థియేటర్లలో వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా ఉండబోతోంది. ఇప్పటికే ఉన్న పుష్ప 2′ సినిమాకి మరో 20 నిమిషాలు జత చేసి ఇవాళ్టి నుంచి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో మొత్తం 3.40 నిమిషాలకుపైగా నిడివి ఉండనుంది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. గత డిసెంబర్ 5న రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ నార్త్ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే వసూళ్లలో ‘బాహుబలి 2’ రికార్డు కూడా బద్దలు కొట్టి రూ.1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ ఇండస్ట్రీ హిట్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
తగ్గిన రేట్లు నేటి నుంచే..
ఇక ఈ రీలోడెడ్ వెర్షన్‌కు పుష్ప టీమ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. అధిక టికెట్ రేట్ల(Ticket Rates) కారణంగా థియేటర్లలో సినిమా మిస్ అయిన వారు చూసేందుకు వీలుగా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ రేట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
కాగా డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించగా.. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘Baahubali 2’ రికార్డు కూడా బద్దలు కొట్టిన ఈ మూవీ మరో రూ.150 కోట్లు వసూలు చేస్తే రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరనుంది.







